Ms Dhoni: ధోనికి ఈ సీజన్ ఆఖరా..? 1 y ago
ఐపీఎల్ వచ్చిందంటే గత కొన్ని సీజన్లుగా ధోని మీదే అభిమానుల దృష్టి నిలుస్తోంది. అతడు ఆడే చివరి టోర్నీ ఇదే అంటూ ఊహాగానాలు రేగడం.. తర్వాతి సీజన్లోనూ అతడు కనబడడం మామూలైంది. గతేడాది ఐపీఎల్ తోనే మహి వీడ్కోలు చెబుతాడనుకుని అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వచ్చారు. కానీ ధోని 2025లోనూ ఆడతాడని తెలిసి సంతోషించారు. కొత్త సీజన్ కోసం సీఎస్కే ఇప్పటికే సన్నాహక శిబిరం మొదలు పెట్టింది. గురువారం ధోని చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడు ధరించిన టీషర్ట్ మీద "వన్ లాస్ట్ టైమ్" అనే సందేశం ఉంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో మళ్లీ చర్చ మొదలైంది.